శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జులై 2018 (09:15 IST)

భళారా... భారత బుడత... 15 ఏళ్లకే బయోమెడికల్‌ ఇంజినీర్‌

భారత సంతతికి చెందిన ఓ బాలుడు అమెరికాలో అద్భుత ఘనత సాధించాడు. 15 ఏళ్ల ప్రాయంలోనే బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీని పొందాడు. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన తాజి

భారత సంతతికి చెందిన ఓ బాలుడు అమెరికాలో అద్భుత ఘనత సాధించాడు. 15 ఏళ్ల ప్రాయంలోనే బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీని పొందాడు. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన తాజి, బిజౌ అబ్రహం అనే దంపతుల కుమారుడు తనిష్క్‌ అబ్రహం.
 
ఈ బుడతుడు డేవిస్‌ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తాజాగా డిస్టింక్షన్‌తో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులో బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ పట్టా పొందాడు. 
 
దీనిపై తనిష్క్ స్పందిస్తూ, చిన్నవయసులోనే ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను సాధించిన ఘనత పట్ల గర్వంగా ఉందన్నాడు. ఇక కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోనే పీహెచ్‌డీ చేస్తానని.. క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సలు అభివృద్ధి చేయడమే తన భవిష్యత్‌ లక్ష్యమన్నాడు. 
 
కాగా, కాలిన గాయాలతో బాధపడుతున్నవారిని తాకకుండానే.. వారి హృదయ స్పందనల వేగాన్ని తెలుసుకునే పరికరాన్ని ఈ బాల మేధావి ఇప్పటికే రూపొందించడం విశేషం. ఈ బుడతుడు విజయం పట్ల అమెరికా శాస్త్రవేత్తలే కాదు భారతీయ శాస్త్రవేత్తలు కూడా అభినందనలు తెలుపుతున్నారు.