సరసులో బోల్తా పడిన పడవ... 135 మంది జలసమాధి
టాంజానియా దేశంలోని విక్టోరియా సరస్సులో పడవ ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 136 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
టాంజానియా దేశంలోని విక్టోరియా సరస్సులో పడవ ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 136 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఉకారా దీవికి సమీపాన విక్టోరియా సరసులో వెళుతున్న ఎంవీ న్యేరెరె పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో దాని సామర్థ్యం కంటే రెట్టింపు స్థాయిలో 200 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. సరుకులు కూడా భారీగా నింపడం కూడా ప్రమాదానికి మరొక కారణమని ప్రత్యక్ష సాక్షులు అన్నారు.
దీంతోపాటు తీరం వద్ద గట్టుపైకి చేరేందుకు అందరు ఒకేసారి పరుగులు తీయడంతో పడవ పక్కకు ఒరిగిపోయిందన్నారు. ప్రమాదం 40 మందిని రక్షించామన్నారు. పడవ బోల్తాకు కారణమైన అందర్నీ అరెస్టు చేయాలంటూ టాంజానియా ప్రెసిడెంట్ మగుపులి ఆదేశాలు జారీ చేశారు.