ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (13:37 IST)

అమెరికాలో టిక్‌టాక్‌కు తాత్కాలిక ఊరట..నిషేధం నిలిపివేసిన కోర్టు

పాపులర్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ డౌన్‌లోడ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన నిషేధాన్ని ఫెడరల్‌ జడ్జి రాత్రి నిలిపివేశారు.

ఈ యాప్‌ మూలాలు చైనాతో సంబంధాలు కలిగి ఉన్నాయంటూ..ఇది దేశ భద్రతకు ముప్పని పేర్కొంటూ టిక్‌టాక్‌పై ట్రంప్‌ ప్రభుత్వం నిషేధం విధించింది.

దీంతో సంస్థ కోర్టును ఆశ్రయించింది. టిక్‌టాక్‌ అభ్యర్థన మేరకు యుఎస్‌ జడ్జి కార్ల్‌ నికోల్స్‌ ఆదివారం  నిషేధాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. నిర్ణయానికి గల కారణాలను కోర్టు ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొనలేదు.

యాప్‌ నూతన డౌన్‌లోడ్లపై సోమవారం నుండి నిషేధం విధించగా జడ్జీ ఉత్తర్వులతో టిక్‌టాక్‌కు ఉపశమనం లభించింది. అయితే నవంబర్‌ 12 వరకు టిక్‌టాక్‌ పనిచేస్తుంది, ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిషేధం ఉండనుంది. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలన్న టిక్‌టాక్‌ అభ్యర్ధనను జడ్జి తోసిపుచ్చారు.