శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (13:28 IST)

అక్టోబ‌రు 2న అమెరికా విద్య‌పై అంత‌ర్జాల‌ స‌ద‌స్సు

రాష్ట్రంలోని విద్యార్థుల‌కు అత్యుత్త‌మ‌మైన విద్యావ‌కాశాల‌ను క‌ల్పించే దిశ‌గా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్పుడు మ‌రో వినూత్న ప్ర‌య‌త్నం చేప‌డుతోంది. విదేశాల్లో చదువుకోవాల‌నే ఆస‌క్తి ఉన్న విద్యార్థుల కోసం, తొలిసారిగా ఒకే సారి అమెరికాలోని వంద అత్యుత్త‌మ విశ్వ‌విద్యాల‌యాల‌ను అంత‌ర్జాలంలో ఒకే వేదిక‌పైకి తీసుకొస్తోంది.

ఈ స‌ద‌స్సు ద్వారా అమెరికాలో చ‌దువుకోవ‌డానికి విద్యార్థుల‌కు ఉన్న అవ‌కాశాలు, ఆర్థిక ప్రోత్స‌హకాలు, గుర్తింపు త‌దిత‌ర అనేక అంశాల‌పై విశ్వ విద్యాల‌యాల అధికారులు విద్యార్థుల‌కు నేరుగా స‌మాచారం అందిస్తారు.

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు ధీటుగా రాష్ట్రంలో విద్యార్థుల‌కు అత్యుత్తమ విద్య అందించాల‌ని, విదేశీ విద్యావ‌కాశాలు కూడా క‌ల్పించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఉన్న‌త విద్యాశాఖ అధికారుల‌ను ఆదేశించారు.

అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో  విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌తీష్ చంద‌ర్‌, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేకాధికారి డాక్ట‌ర్ ఎం. హ‌రికృష్ణ ఇత‌ర ఉన్న‌తాధికారులు విదేశీ విద్యావ‌కాశాలు క‌ల్పించే దిశ‌గా ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వ విదేశీ విద్యా కో ఆర్డినేట‌ర్ డాక్ట‌ర్ కుమార్ అన్న‌వ‌ర‌పు తెలిపారు. 
 
క‌రోనా నేప‌థ్యంలో విద్యార్థుల కోసం అమెరికాలోని అత్యుత్త‌మ విశ్వ‌విద్యాల‌యాల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చి మ‌న రాష్ట్ర ఔత్సాహిక విద్యార్థుల‌తో ప్ర‌త్య‌క్షంగా ముఖాముఖి సంభాషించే, విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేలా అంత‌ర్జాల స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. 

అమెరికాలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన వంద విశ్వ‌విద్యాల‌యాల‌ను ఇలా ఒక‌వేదిక‌పైకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఎడ్యుకేష‌న్ యూఎస్ఏ నిర్వ‌హించే త‌న వార్షిక యు.ఎస్‌.యూనివ‌ర్సిటీ ఫెయిర్‌ను ఈ సారి అంత‌ర్జాల స‌ద‌స్సుగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం, హైద‌రాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌, అమెరికాలోని విశ్వ‌విద్యాల‌యాలు సంయుక్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నాయి. 
 
ఎన్నో ఉప‌యోగాలు
ఈ కార్య‌క్ర‌మం విద్యార్థుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. అమెరికాలో డిగ్రీ చ‌ద‌వాలి అనుకునేవారికి, అక్క‌డ మాస్ట‌ర్స్‌, పీహెచ్‌డీ చేయాల‌నుకునే విద్యార్థుల‌కు ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. అమెరికాలోని విశ్వ విద్యాల‌యాల్లో చుదువ‌కోవ‌డానికి ఉన్న అవ‌కాశాల గురించి విద్యార్థులు సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

అక్క‌డ అక‌డిమిక్ కార్య‌క్ర‌మాలు, విశ్వ‌విద్యాల‌య వాతావ‌ర‌ణం, విద్యార్థుల‌కు చ‌దువుకోవ‌డానికి క‌ల్పించే ఆర్థిక స‌హ‌కారం, అమెరికా క‌ళాశాల‌లు, విశ్వ విద్యాల‌యాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం త‌దిత‌ర అనేక అంశాల గురించి ఆయా వ‌ర్సిటీల‌కు చెందిన అధికారులే స్వ‌యంగా వివ‌రిస్తారు.

EducationUSA అనేది అమెరికా ఉన్న‌త విద్య‌కు సంబంధించి స‌మాచారం అందించే అధికారిక సంస్థ‌. ఈ సంస్థ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 425 అంతర్జాతీయ విద్యార్థి స‌ల‌హా కేంద్రాల‌ను క‌లిగి ఉంది. ఈ కేంద్రాల ద్వారా అమెరికాలోని విద్యా సంస్థ‌ల‌కు సంబంధించి క‌చ్చిత‌మైన స‌మాచారం అందిస్తుంది. 
 
స‌ద‌స్సు ప్ర‌త్యేక‌త‌లు
* అమెరికా విశ్వ విద్యాల‌య ప్ర‌తినిధుల‌తో ముఖాముఖి సంప్ర‌దించుకునే అవ‌కాశం
* కోర్సుల గురించి మ‌న సందేహాల‌ను నివృత్తి చేసుకునే వీలు
* చ‌దువు కోసం అమెరికా అందిస్తున్న ఆర్థిక స‌హాయంపై వివ‌రాలు తెలుసుకునే అవ‌కాశం
* వ‌ర్సిటీల‌కు సంబంధించి తాజా బ్రోచ‌ర్‌ను డౌన్‌లోడు చేసుకోవ‌చ్చు
 
ఈ లింక్ ద్వారా పాల్గొన‌వ‌చ్చు
 
ఈ స‌ద‌స్సులో పాల్గొని, అమెరికా విశ్వ‌విద్యాల‌య అధికారుల‌తో నేరుగా సంప్ర‌దించాల‌నుకునే వారు ఈ అంత‌ర్జాల లింక్‌ల ద్వారా స‌ద‌స్సులో పాల్గొన‌వ‌చ్చు. 
 
గ్రాడ్యుయేట్ ఫెయిర్ (మాస్ట్ర్స్, పీహెచ్‌డీ కార్య‌క్ర‌మాలు)
 
తేదీ, స‌మ‌యం: అక్టోబ‌రు 2 శుక్ర‌వారం, 3 శ‌నివారం, సాయంత్రం 5:30 గంట‌ల నుంచి 10:30 గంట‌ల వ‌ర‌కు 
న‌మోదు కొర‌కు :  bit.ly/EdUSAFair20-Bmail 
 
అండ‌ర్ గ్రాడ్యుయేట్ ఫెయిర్ (అసోసియేట్ మ‌రియు బ్యాచిల‌ర్స్ ప్రోగ్రామ్స్‌)
 తేదీ, స‌మ‌యం: అక్టోబ‌రు 9 శుక్ర‌వారం, 10 శ‌నివారం, సాయంత్రం 5:30 గంట‌ల నుంచి 10:30 గంట‌ల వ‌ర‌కు 
న‌మోదు కొర‌కు :  bit.ly/UGEdUSAFair20-BMail  
 
ఈ స‌ద‌స్సుల గురించి విద్యార్థుల‌కు ఏవైనా అనుమానాలుంటే విద్యార్థులు [email protected], [email protected]  మెయిల్ చిరునామాలో సంప్ర‌దించ‌వ్చు.  విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని డాక్ట‌ర్ కుమార్ అన్న‌వ‌ర‌పు కోరారు.