శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (13:02 IST)

నవంబర్ లో ప్రత్యేక పరీక్ష ద్వారా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్టును నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి డా సురేష్ స్పష్టం చేశారు. నవంబర్ మొదటి, రెండు వారాల్లో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నామని మంత్రి డా. సురేష్ వివరించారు. 

ఈ మేరకు ట్రిపుల్ ఐటీల యాజమాన్యం తీర్మానం చేశాయని చెప్పారు. అయితే అందుకోసం చట్టంలో సవరణ చేయాల్సి ఉంటుందని, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో వంద మార్కులకు పరీక్ష ఉంటుందని తెలిపారు.

ప్రత్యేక పద్దతిలో ఓఎంఆర్ ఆధారితంగా ఆఫ్లైన్లో నిర్వహించే ఈ ప్రవేశపరీక్షలో మ్యాథ్స్కకు 50, సైన్స్ కు50 మార్కులు ఉంటాయని చెప్పారు. పదో తరగతి సిలబస్ ఆధారంగాఉండే ఈ పరీక్ష కోసం ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని, తెలంగాణలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉన్న ఆర్జీయూకేటీ (త్రిబుల్ ఐటీ)లో ఏటా పదో తరగతి ఫలితాల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి అందరినీ పాస్ చేసిన విషయం తెలిసిందేనని మంత్రి తెలిపారు.