బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 26 సెప్టెంబరు 2020 (21:46 IST)

ఇంట్లో జారిపడిన నన్నపనేని రాజకుమారి, తలకు గాయం

టీడీపీ మహిళా నేత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ప్రమాదానికి గురయ్యారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఆమె తన ఇంట్లో జారి పడటంతో తలకు గాయమైంది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
 
ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వచ్చేశారు. గాయం తీవ్రత తక్కువేనని తెలుస్తోంది. నన్నపనేని జారి పడ్డారన్న విషయం తెలియగానే టీడీపీ నేతలు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నారు. ఆమె క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
 
నన్నపనేని రాజకుమారి కొంతకాలం కిందట ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి తెనాలిలో తమ స్వగృహంలో ఉంటున్నారు.