శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (16:36 IST)

హోటళ్లలో మటన్ తింటున్నారా? జాగ్రత్త..!

హోటళ్లలో మటన్ లాగించేస్తున్నారా..? జాగ్రత్త అంటున్నారు.. అధికారులు. టన్ లెక్కల్లో జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నారని తాజాగా తేలింది. హోటళ్లు, రెస్టారెంట్లు, మటన్ షాపులకు గేదె మాంసాన్ని సరఫరా చేస్తున్నారని తెలిసింది. నెల్లూరు శివారు ప్రాంతాల్లోని కబేళాలపై నిర్వహించిన దాడుల్లో ఈ విషయాన్ని ఆరోగ్య శాఖాధికారులు తేల్చారు. 
 
అంతేగాకుండా కుళ్లిపోయిన మాంసాన్ని కూడా అధికారులు గుర్తించారు. దీంతో మటన్ మాఫియా బాగోతం వెలుగులోకి వచ్చింది. మటన్ కబేళాలలో జంతువుల మాంసం విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. 
 
కాబట్టి మటన్ మాంసాన్ని కొనేటప్పుడు వ్యత్యాసం గుర్తిస్తే అధికారులు ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేయాలని.. హోటళ్లలోనూ మటన్ టేస్టు మారితే అధికారులకు ఫోన్ కాల్ ద్వారా తెలియజేయాలని కోరారు. ఇంకా గేదె మాంసం కుళ్లిన పరిస్థితుల్లో వుందని.. అలాంటి వాటిని హోటళ్లలో తినకపోవడం మంచిదని అధికారులు చెప్తున్నారు.