సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (12:57 IST)

ఆ ఒక్కటి మాత్రం చేస్తే..? మటన్ గ్రేవీతో గ్రామానికే విందు కంపల్సరీ..?! (video)

సాధారణంగా గ్రామాల్లో ఏదైనా తప్పు చేస్తే.. ఆ గ్రామ పంచాయతీలు శిక్ష ఇవ్వడం చేస్తుంటాయి. కానీ ఆ గ్రామంలో ఎవరైనా తాగిన మత్తులో పట్టుబడితే.. మటన్ కూరతో గ్రామానికే విందు ఇవ్వాలనే వింత శిక్షను విధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన గుజరాత్, పనస్కంధా జిల్లాలోని అమిర్ఖాత్ తాలుకాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఆ గ్రామంలో నివసించే పలువురు వ్యక్తులు మద్యానికి బానిస అయ్యారు. ఇంకా తప్ప తాగి కుటుంబీకులపై దాడికి పాల్పడుతున్నారు. ఫలితంగా నేరాల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. దీన్ని నియంత్రించే క్రమంలో గ్రామ పెద్దలంతా ఓ నిర్ణయానికి వచ్చారు. ఎవరైతే మద్యం తాగి పట్టుబడతారో వారికి భారీ జరిమానా విధించాలని తీర్మానించారు. 
 
ఇందులో భాగంగా మద్యం తాగి పట్టుబడితే రెండు వేల రూపాయల జరిమానా చెల్లించాలని, తప్ప తాగి వాగ్వివాదానికి దిగితే ఐదు వేల రూపాయల జరిమానా కట్టాలని.. ఇంకా ఆ గ్రామ ప్రజలందరికీ మటన్ గ్రేవీతో విందు ఇవ్వాలని శిక్ష ఖరారు చేశారు. దీంతో గ్రామంలో తాగుబోతుల సంఖ్య తగ్గింది. ఈ శిక్ష అమలు చేసిన ప్రారంభంలో నలుగురు పట్టుబడ్డారు. 
 
2018లో ఒక్కడు మాత్రమే తప్ప తాగి పట్టుబడ్డాడు. అలాగే 2019వ సంవత్సరం ఇది వరకు ఒక్కరు కూడా ఈ శిక్షకు దొరకలేదని గ్రామ వాసులు అంటున్నారు. మొత్తానికి మటన్ కూర విందుతో తాగుబోతులు హడలిపోతున్నారని వారు చెప్తున్నారు.