మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (16:12 IST)

సూర్యుడిని ఫోటో తీసిన నాసా ఉపగ్రహం.. స్మైలింగ్ సన్ అంటూ..?

Nasa
Nasa
నాసా ఉపగ్రహం ఈ వారం సూర్యుడిని ఫోటో చేసింది. ఈ ఫోటోను చూసినవారంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. సూర్యుడు నవ్వుతున్నట్లుగా కనిపించే నమూనా చిత్రాన్ని నాసా విడుదల చేసింది. 
 
ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నప్పుడు, యూఎస్ స్పేస్ ఏజెన్సీ దీనిని స్మైలింగ్ సన్ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. సూర్యుడు నవ్వుతున్న ముఖంతో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.
 
నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సూర్యుడిని 'నవ్వుతూ' చూసిందని నాసా ఒక ట్వీట్‌లో పేర్కొంది. అతినీలలోహిత కాంతిలో చూసినప్పుడు సూర్యునిపై ఉన్న ఈ చీకటి మచ్చలను కరోనల్ హోల్స్ అంటారు.