శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2017 (10:48 IST)

ఫిలిప్పీన్స్‌లో టెంబిన్ తుఫాను బీభత్సం... 182 మంది మృతి

ఫిలిప్పీన్స్ దేశాన్ని పెను తుఫాను అతలాకుతలం చేసింది. ఈ పెను తుఫాను ధాటికి 182 మంది మృత్యువాతపడ్డారు. మరో 200 మంది వరకు గల్యంతయ్యారు. ఈ పెను తుఫానుకు 'టెంబిన్' అనే పేరు పెట్టారు.

ఫిలిప్పీన్స్ దేశాన్ని పెను తుఫాను అతలాకుతలం చేసింది. ఈ పెను తుఫాను ధాటికి 182 మంది మృత్యువాతపడ్డారు. మరో 200 మంది వరకు గల్యంతయ్యారు. ఈ పెను తుఫానుకు 'టెంబిన్' అనే పేరు పెట్టారు. 
 
భారీ వర్షాలతో ఒక్కసారిగి మెరుపు వరదలు సంభవించి, పెద్ద ఎత్తున మట్టి కొట్టుకురావడంతో 182 మంది మరణించారు. మరో 153 మంది ఆచూకీ తెలియరాలేదని వెల్లడించిన అధికారులు, వేలమంది నిరాశ్రయులయ్యారని, వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. 
 
కాగా, 'టెంబిన్' ప్రభావం అధికంగా ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా, ప్రజలు పట్టించుకోలేదని, అందువల్లే ప్రాణనష్టం అధికంగా ఉందని ఆ దేశ అధికారులు వ్యాఖ్యానించారు.