గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2017 (15:23 IST)

జీపులో అమ్మాయిని చూసి హస్తప్రయోగం చేశాడు.. నెటిజన్లకు షాకిచ్చిన విక్టిమ్.. ఎందుకు?

మహిళలపై అకృత్యాలు అధికమవుతున్నాయి. మహిళలను లోబరుచుకునేందుకు కామాంధులు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అత్యాచారాలు చేయడం, అమ్మాయిల పట్ల అభ్యంతరకర రీతిలో వ్యవహరిస్తున్న

మహిళలపై అకృత్యాలు అధికమవుతున్నాయి. మహిళలను లోబరుచుకునేందుకు కామాంధులు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అత్యాచారాలు చేయడం, అమ్మాయిల పట్ల అభ్యంతరకర రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటన ఫిలిప్పైన్స్ దేశంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్కూల్ ముగించుకుని ఇంటికెళ్లేందుకు చ వినుయా అనే యువతి జీపు ఎక్కింది. ఆ జీపులో ఆమెతో పాటు కొంతమంది ప్రయాణిస్తున్నారు. 
 
చ వినుయా పక్కన ఓ అబ్బాయి కూర్చుని వున్నాడు. అతడు తదేకంగా ఆ అమ్మాయిని చూస్తూ.. అభ్యంతరకరంగా ఉన్నట్టుండి హస్తప్రయోగం చేయడం మొదలెట్టారు. అందరూ చూస్తున్నారనే సిగ్గు లేకుండా.. జుగుప్సాకరంగా వ్యవహరించిన అతడికి ఆ యువతి దూరం జరిగింది. కానీ పెద్దగా అరిచి జీపు నుంచి దిగేయాలని చ వినుయా అనుకుంది. అలాగే అతడిని జీపులో వున్న ఎవ్వరూ అతడి చర్యను ఖండించలేదు. అమ్మాయి ముందు ఇలా వ్యవహరించడం తప్పు కాదా అని అడగనూ లేదు. 
 
దీనికి కారణం.. ఇవన్నీ చేస్తే ఆ అమ్మాయిపై అతడేమైనా దాడి చేస్తాడేమోనని భయంతో బాధితురాలితో పాటు అందరూ మిన్నకుండిపోయారు. జీపులో సైలెంట్‌గా వుండి అతని నుంచి దూరమైన బాధితురాలు సోషల్ మీడియాలో అతడు చేసిన వేధింపులను వివరిస్తూ ఓ పోస్ట్ చేసింది. చ వినుయా సోషల్ మీడియాలో తనకు జరిగిన బాధను వెల్లగక్కితే, నెటిజన్లు వేరే విధంగా స్పందించారు. 
 
పోస్ట్ చూసిన కొంత మంది ఆ అసభ్యకరమైన పని చేసిన వ్యక్తిని నిందించకుండా చ వినుయా దుస్తులపై పడ్డారు. ఆమె శరీరాన్ని దాచే దుస్తులు ధరించి వుండదని.. రెచ్చగొట్టే విధంగా దుస్తులు వేస్తే పరిస్థితి ఇలాగే వుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయిన ఆ అమ్మాయి తను ఆ సమయంలో యూనిఫామ్ వేసుకున్నానని, తన అందాలను ఆరబోసేలా ఫ్యాషన్ దుస్తులను వేసుకోలేదని నెటిజన్లకు షాక్ ఇచ్చింది. అబ్బాయిలు చేసే తప్పులకు అమ్మాయిలను వేలెత్తి చూపకండని హితవు పలికింది. దీంతో నెటిజన్లు నోర్లు మూశారు.