శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (09:33 IST)

ట్రంప్ వీరాభిమాని కరోనాతో మృతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని ఇక లేరు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స కృష్ణ(40).. ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. డొనాల్డ్ ట్రంప్‌ కరోనా బారినపడినప్పటి నుంచి కృష్ణ తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

ఈ క్రమంలోనే ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిమానంతో కృష్ణ.. తన ఇంటి వద్ద ట్రంప్ విగ్రహాన్ని పెట్టి గత కొద్ది రోజులుగా పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రంప్‌ను కలవడం తన చిరకాల కోరిక అని.. బుస్స కృష్ణ పలు ఇంటర్యూల్లో వెల్లడించారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న ట్రంప్.. భారత పర్యటనకు వచ్చినప్పుడు కృష్ణ‌ను కలుస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కుటుంబ సమేతంగా ఇండియాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు.. కృష్ణను కలవకుండానే వెనుదిరిగారు.

నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ కచ్చితంగా విజయం సాధిస్తారని.. కృష్ణ అశాభావం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్‌ను కలవాలనే చిరకాల కోరిక తీరకుండానే బుస్స కృష్ణ కన్నుమూశారు.