బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (09:02 IST)

కరోనా వ్యాక్సిన్‌: కొవాగ్జిన్‌ కు మరింత బలం

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌లో 'అల్‌హైడ్రాక్సిక్విమ్‌-2' అనే అనుబంధ ఔషధాన్నీ వినియోగించనున్నట్లు ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది.

దీనివల్ల మెరుగైన వ్యాధి నిరోధకశక్తితోపాటు ఎక్కువకాలం వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందని వివరించింది. ఈ ప్రత్యేక కారకాన్ని వైరోవ్యాక్స్‌ అనే సంస్థ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది.

తొలి నుంచే కొవాగ్జిన్‌లో ఆల్‌హైడ్రాక్సిక్విమ్‌ - 2 కారకాన్ని పొందుపరచినట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల్లో ఆశాజనక ఫలితాలు కనిపించినట్లు వెల్లడించింది.

వ్యాక్సిన్‌ అభివృద్ధిలో దోహదపడే ఈ రకమైన కారకాల అభివృద్ధి ఇప్పుడు అత్యవసరమని భారత్‌ బయోటెక్‌ ఎం.డి. కృష్ణ ఎల్లా తెలిపారు. వీటివల్ల శరీరంలో ప్రతిరక్షాలు వేగంగా వృద్ధి చెందుతాయన్నారు. అలాగే ఎక్కువకాలం వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందన్నారు. తద్వారా వ్యాధిని అడ్డుకునే సామర్థ్యం వ్యాక్సిన్‌లో మరింత బలపడుతుందని వివరించారు.

ప్రస్తుతం కొవాగ్జిన్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే 'డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా' అనుమతులతో మూడో దశ ప్రయోగాలు ప్రారభిస్తామని సంస్థ ప్రకటించింది.