సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 జులై 2020 (10:17 IST)

ముందుగా అవసరమైన ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌: బిల్‌గేట్స్

కరోనా మందులు, వ్యాక్సిన్‌ను అవసరం ఉన్న సామాన్య ప్రజలకు ముందుగా చేరవేయాలని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్ బిల్‌ గేట్స్‌ సూచించారు.

"ఒకవేళ వ్యాక్సిన్‌ను అవసరం ఉన్న ప్రజలకు కాకుండా హయ్యస్ట్‌ బిడ్డర్‌‌కు ఇస్తే కరోనా మహమ్మారి చాలా కాలంపాటు ఇక్కడే ఉంటుంది. మార్కెట్ కారకాల ఆధారంగా కాక సమానత్వం బేస్డ్‌గా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేలా నాయకులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి" అని బిల్‌ గేట్స్ సూచించారు.

ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ నిర్వహించిన కొవిడ్–19 కాన్ఫరెన్స్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన నిర్మొహమాటంగా, నిర్భయంగా పలు అభిప్రాయాలను వెల్లడించారు.

వైరస్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ధనిక దేశాలు దాన్ని ముందుగా తన్నుకెళ్తాయని, తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్ అందదని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో బిల్‌ గేట్స్ వ్యాఖ్యలు ఎనలేని ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.