సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 జులై 2020 (15:42 IST)

ప్రియాంక చోప్రాకి అరుదైన గౌరవం (video)

మన మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రాకి అరుదైన అవకాశం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత మహిళలు పాల్గొనే సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానుంది. 
 
ఈ విషయాన్ని ప్రియాంక తన ట్విటర్‌లో స్వయంగా తెలిపింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిచెల్‌ ఒబామా, ప్రిన్స్‌ హ్యారీ సతీమణీ మెగన్‌ మార్కెల్‌, నోబుల్‌ బహుమతి గ్రహీత నదియా మురాద్‌, ఫేస్‌బుక్‌ సీవోవో షెరిల్‌ సాండబర్గ్‌, నటి జమీలా జమిల్‌ వంటి ప్రభావంత మహిళలు ఈ నెల 13-15 తేదీల మధ్య వర్చువల్‌ 'గర్ల్‌ అప్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌'లో పాల్గొనబోతోంది.

వీరంతా ఈ సమ్మిట్‌లో 'లింగ సమానత్వం'పై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రియాంక చోప్రాను ఆహ్వానించారు.