బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (19:59 IST)

ఆక్స్‌ఫర్డ్‌ కరోనా వ్యాక్సిన్ వద్దు.. ఆస్ట్రేలియాలో వ్యతిరేకత

కరోనా వ్యాక్సిన్ ధస్తే చాలు.. ఎలాగోలా ప్రాణాలు దక్కించుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అది ఎప్పుడెప్పుడు అందుబాటులో కి వస్తుందా అని మొక్కులు చేసుకుంటున్నారు.

కానీ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ను తిరస్కరించాలంటూ ఆస్ట్రేలియాలోని కొందరు మత పెద్దలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. దీనిపై ఆ దేశ ప్రధానికి కూడా లేఖలు రాశారు.

1970లో మృతి చెందిన ఓ శిశువు మూలకణాలను ఆక్స్‌ఫర్డ్‌ తన వ్యాక్సిన్లో వినియోగించిందని పేర్కొంటూ ఆస్ట్రేలియాకు చెందిన సుఫీయా ఖలీఫా అనే ఇమామ్‌ ఓ వీడియోలో పేర్కొన్నారు. ముస్లిం మత ఆచారం ప్రకారం ఇది హరామ్‌ అని, కాబట్టి టీకాను తీసుకోవద్దని పిలుపునిచ్చారు.

అంతకు ముందే.. క్రైస్తవుల మత పెద్ద ఆర్చ్‌బిషప్‌ ఆంథోనీ ఫిషర్‌ కూడా టీకాను వ్యతిరేకించారు. టీకా అభివృద్ధిలో శిశువు మృతకణాలు వినియోగించారని, ఇది క్రైస్తవులకు నైతికపరమైన సమస్యను సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.

ఆర్చ్‌బిషప్‌కు మద్దతు తెలుపుతూ ఆంగ్లికన్‌, గ్రీక్‌ ఆర్థొడాక్స్‌ మత పెద్దలు కూడా లేఖపై సంతకాలు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆస్ట్రేలియాలో దుమారం రేపుతోంది.