శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (08:00 IST)

కరోనా గురించి చాలా తెలుసుకున్నా: ట్రంప్‌

కరోనా గురించి చాలా తెలుసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కొవిడ్‌ వైరస్‌ బారిన పడిన ఆయన నాలుగు రోజుల పాటు వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుని శ్వేతసౌధానికి చేరుకున్నారు. 74 ఏళ్ల ట్రంప్‌ శ్వేతసౌధంలోని తన గదికి వెళ్లేందుకు లిఫ్టు వాడకుండా దక్షిణ పోర్టికో మెట్లు ఎక్కి మరీ వెళ్లారు.
 
‘‘కరోనా వైరస్‌ గురించి నేను చాలా తెలుసుకున్నా. వైర్‌సకు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. అది మీపై ఆధిపత్యం ప్రదర్శించకుండా చూసుకోవాలి. ట్రంప్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని గొప్ప మందులను అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి చేశాం. టీకాలు కూడా త్వరలోనే వస్తున్నాయి. మనమంతా కలిసి వైర్‌సపై విజయం సాధిద్దాం’’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. 

ఆస్పత్రి నుంచి శ్వేతసౌధానికి బయల్దేరే ముందు ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తన ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు. 20 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడే ఉల్లాసంగా ఉన్నానని తెలిపారు. ట్రంప్‌ను అనుసరించే ముగ్గురు జర్నలిస్టులకు ఇప్పటికే పాజిటివ్‌ వచ్చింది. శ్వేతసౌధం సిబ్బంది, సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు కూడా వైరస్‌ గురించి భయపడుతున్నారు.