సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (18:51 IST)

చైనాపై వైఖరి మారిపోయింది.. కరోనాను వూహాన్‌లోనే అంతం చేయాల్సింది..

చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మండిపడ్డారు. చైనాపై తమ వైఖరి పూర్తిగా మారిపోయిందని.. ఇందుకు ప్రాణాంతక కరోనా మహమ్మారి తమ దేశాన్ని కకావికలం చేయడమేనని చెప్పారు. చైనా ఈ మహమ్మారిని వుహాన్‌లోనే అంతం చేయాల్సిందని, అలా చేసి ఉంటే ప్రపంచానికి ఈ స్థాయిలో బాధ ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
కరోనా మహమ్మారి నుంచి అమెరికన్లను రక్షించుకొనేందుకు దూకుడుగా విధానాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. కాగా, మోసం, వంచన, కప్పిపుచ్చుకోవడం కారణంగానే వైరస్‌ ప్రపంచమంతా పాకిందని ట్రంప్ గతంలోనే చైనాను విమర్శించారు. 
 
ప్రస్తుతం 70 శాతం ప్రాంతాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. అందువల్ల కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో మరింత కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.