గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (12:56 IST)

ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా దాడి

కాబూల్‌ విమానాశ్రయంలో జరిగిన దాడులకు కారణమైన వారిపై అగ్ర రాజ్యం చర్యలకు ఉపక్రమించింది. ఆఫ్గాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా డ్రోన్‌ దాడులతో విరుచుకుపడింది.

నంగర్‌ పహార్‌ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్ల దాడి చేపట్టింది. తమ లక్ష్యాన్ని చేరుకున్నట్లు సెంట్రల్‌ కమాండ్‌ కెప్టెన్‌ బిల్‌ అర్బన్‌ తెలిపారు. ప్రాణ నష్టం గురించి తెలియదని ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ దాడులు నేపథ్యంలో కాబూల్‌ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని పౌరులను అగ్రరాజ్యం హెచ్చరించింది. కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అబే గేట్‌ ముందు జరిగిన ఆత్మాహుతి దాడుల్లో సుమారు 200 మంది మృతి చెందినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి.

అందులో 13 మంది అమెరికా జవాన్లతో పాటు తాలిబన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నామని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించింది.