శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (09:21 IST)

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం ఎలావుంది?

కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిన్ జాన్సన్ కూడా కూడా ఉన్నారు. ఆయనలో వైరస్ లక్షణాలు కనిపించడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయినప్పటికీ వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గక పోవడంతో వ్యక్తిగత వైద్యుని సలహా మేరకు లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే, ఆయన ఆరోగ్యం విషమంగా మారటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, చికిత్సకు కూడా ఆయన స్పందిస్తున్నారని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ఆరోగ్యం క్లినికల్లీ స్టేబుల్ అని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి తెలిపారు. మంత్రివర్గ సహచరులతోను, అధికారులతోనూ ఆయన మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
 
కాగా, బోరిస్‌కు ప్రస్తుతం స్టాండర్డ్ ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్వర్డ్ అర్గర్ తెలిపారు. వెంటిలేటర్ సహాయం లేకుండానే ఆయన శ్వాస తీసుకుంటున్నారని తెలిపారు.