నిన్న యువరాజు చార్లెస్‌కు నేడు బ్రిటన్ ప్రధానికి కరోనా
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. రవి అస్తమించని సామ్రాజ్యం అని చెప్పుకునే బ్రిటీష్‌పై కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంది. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అస్వస్థతకు లోనవ్వడంతో పరీక్షలు జరపడంతో ఆయనకు కరోనా పాజిటివ్ అచ్చినట్లు రిపోర్టుల్లో తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. తొలుత.. కరోనా లక్షణాలు కనపడటంతో.. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రోఫెసర్ క్రిస్ విట్టీ సూచనలతో బోరిస్ జాన్సన్‌కు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే యువరాజు చార్లెస్‌కు కరోనావైరస్ సోకినట్లు చార్లెస్ హౌస్ ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. 71 ఏళ్ళ ప్రిన్స్ చార్లెస్‌లో స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలు కనిపించాయని పేర్కొంటూనే ఆయన ఆరోగ్యం బాగుందని చార్లెస్ హౌస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రిన్స్ చార్లెస్ భార్య డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ కామిలాకు కూడా పరీక్షలు నిర్వహించారు. అయితే, ఆమెకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని నిర్ధారణ అయింది. బ్రిటన్ రాణి తన కుమారుడిని మార్చి 12న చివరిసారిగా కలిశారని, ఆమె ఆరోగ్యంతో ఉన్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.