శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (23:31 IST)

కరోనా మృతుల్లో నిజాలు.. తక్కువ మరణాలు చూపిస్తున్నారట!

కరోనా మరణాల లెక్కలకు సంబంధించి ఐహెచ్‌ఎంఈ తాజా అధ్యయనం షాకింగ్‌ అంచనాలను వెలువరించింది. అనేక దేశాలు వాస్తవ మరణాల కంటే తక్కువ మరణాలను చూపించాయని తాజా అధ్యయనం తేల్చింది. 
 
ముఖ్యంగా భారతదేశంలో 4.3 లక్షల మేర కరోనా మరణాలను తగ్గించినట్లు యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఈ) పరిశోధకులు తమ అధ్యయనంలో తెలిపారు.
 
ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ప్రకటించిన మరణాల సంఖ్యల కంటే వాస్తవ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది. అమెరికా మరణాల సంఖ్యను 3.4 లక్షలు తగ్గించిందని అధ్యయనం చెబుతోంది. ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల మాదిరిగానే ఇండియా కూడా కోవిడ్‌ మరణాలను తక్కువ చేసి చూపించిందని ఐహెచ్‌ఎంఈ తేటతెల్లం చేసింది. 
 
భారతదేశం 4.3 లక్షల మరణాలను తక్కువగా చూపించిందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే రష్యా ఆదేశ మరణాల సంఖ్యను దాదాపు 5.93 లక్షలు తగ్గించిందని అధ్యయనం కనుగొంది. మార్చి 2020- మే, 2021 వరకు సంభవించిన కోవిడ్‌ మరణాలపై 20 దేశాల డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది.