సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (12:18 IST)

అర్జెంటీనాలో ఆర్థిక మాంద్యం.. భారీగా పెరిగిపోయిన కండోమ్‌ల ధర

ప్రపంచ ఆర్థిక మాంద్యం మెల్లగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇలాంటి దేశాల్లో అర్జెంటీనా కూడా ఒకటి. ఈ దేశం ఆర్థిక సంక్షోభం దెబ్బకు విలవిల్లాడిపోతోంది. దక్షిణ అమెరికాలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన అర్జెంటినా ఇలాంటి దుస్థితి ఎదుర్కోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 
 
ఈ మాంద్యం ప్రభావం కారణంగా దేశ కరెన్సీ పెసో విలువ దారుణంగా పడిపోవడంతో పాటు ద్రవ్యోల్బణం దారుణంగా దిగజారి ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చివరికి గర్భనిరోధక మాత్రలు, కండోములు కూడా కొనేందుకు ప్రజలు వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఫలితంగా దేశంలో కండోముల అమ్మకాలు 8 శాతం, గర్భనిరోధక మాత్రల అమ్మకాలు 6 శాతం మేర పడిపోయినట్టు తయారీ కంపెనీలు, ఫార్మసిస్టులు తెలిపారు.  ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వల్లే ఇలా జరిగిందని అర్జెంటినా ప్రముఖ నటుడు గిల్లెర్మో అక్వినో ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ కరెన్సీ విలువ పడిపోవడం తనను చాలా బాధకు గురిచేస్తోందన్నాడు.  
 
పెసో విలువ ఒక్కసారిగా పడిపోవడంతో అర్జెంటినాలో కండోముల ధరలు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 36 శాతం పెరిగాయి. దీంతో చాలామంది వాటిని కొనడం మానేశారు. నెలకు 1.44 లక్షల మంది మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడడం మానేశారని అర్జెంటినా ఫార్మాస్యూటికల్ కాన్ఫెడరేషన్ అధ్యక్షురాలు ఇసబెల్ రెనోసో తెలిపారు.