సుష్మా స్వరాజ్.. 'సూపర్ మామ్ ఆఫ్ స్టేట్'.. ఈ మాట ఎవరన్నారు?
భారత విదేశీవ్యవహారాల శాఖామంత్రి సుష్మా స్వరాజ్‌పై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ప్రశంసలతో కూడిన ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సుష్మా స్వరాజ్‌ను సూపర్ మామ్ ఆఫ్ స్టేట్‌గా అభివర్ణ
భారత విదేశీవ్యవహారాల శాఖామంత్రి సుష్మా స్వరాజ్‌పై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ప్రశంసలతో కూడిన ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సుష్మా స్వరాజ్‌ను సూపర్ మామ్ ఆఫ్ స్టేట్‌గా అభివర్ణించింది. ఈ తరహా కథనాన్ని ప్రచురించడానికి గల కారణాలను అందులో పేర్కొంది. విదేశీ వ్యవహారాల శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుష్మా స్వరాజ్ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు అర్థరాత్రయినా అపరాత్రయినా అందుబాటులో ఉండటాన్ని ఆ పత్రిక ప్రత్యేకంగా ప్రశంసించింది.
ఇటీవలికాలంలో సౌదీ అరేబియాలో జీతాలు లేకుండా అలమటిస్తున్న భారతీయ కార్మికులకు సాయం చేయడం, పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న ఒక యువతికి ఒక్కరోజు వ్యవధిలో పాస్‌పోర్టు ఇప్పించి భర్త వద్దకు హనీమూన్‌కు పంపడం... ఘర్షణ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని.. వీసా సమస్యలు ఎదుర్కొంటున్నవారినికి సాయం అందించడం వంటి పనులు చేస్తూ.. 'మై చైల్డ్' అని ఓ తల్లిలా ఆప్యాయంగా సంబోధిస్తూ ఆపన్నహస్తం అందించేందుకు ముందున్నారంటూ పేర్కొంది.