అమెరికా నరహంతకుడు ఆత్మహత్య..
అమెరికాలోని మైనె రాష్ట్రం లెవిస్టన్‌లో కాల్పులు జరిపి 22 మందిని పొట్టనబెట్టుకున్న నరహంతకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నరకహంతకుడు రాబర్ట్ తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా తేలింది.
లెవస్టన్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలేలో కాల్పులు జరిపి 22 మందిని రాబర్ట్ హత్య చేశాడని పోలీసులు చెప్పారు. ఆపై కారులో నిందితుడు పారిపోయాడు.
హంతకుడిని పట్టుకోవడానికి ఎఫ్‌బీఐ అధికారులు కూడా రంగంలోకి దిగారు. రెండు రోజుల పాటు విస్తృతంగా తనిఖీలు చేసిన పోలీసులు.. లిస్బన్ ఫాల్స్ సమీపంలో రాబర్ట్ కార్డ్ డెడ్ మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ప్రాథమిక ఆధారాలతో రాబర్ట్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వెల్లడించారు.