1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (14:04 IST)

పోలండ్‌, రొమేనియా దేశాల్లో కమలా హారిస్ పర్యటన

ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు తాత్కాలికంగా కాల్పుల విరమణ ఇచ్చిన నేపథ్యంలో.. ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలైన పోలండ్‌, రొమేనియా దేశాల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ కీలక పర్యటన చేపట్టనున్నారు. 
 
తాము ప్రత్యక్షంగా యుద్దంలో పాల్గొనబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, కమలా హారిస్‌ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా వచ్చే వారంలో కమలా హారిస్‌ ఆ దేశాల్లో పర్యటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
రష్యా దురాక్రమణలకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా కమలా హారిస్​ పర్యటన వుంటుందని డిప్యూటీ ప్రెస్​ సెక్రటరీ సబ్రినా సింగ్​ వెల్లడించారు. 
 
ఈ పర్యటనలో భాగంగా కమలా హారిస్ మార్చి 9-11 మధ్య పోలండ్​లో రాజధాని వార్సా​, రొమేనియాలోని బుకారెస్ట్​ టూరుకు వెళ్తారు. ఈ క్రమంలో ఆ రెండు దేశాల నేతలతో సమావేశమై.. ఉక్రెయిన్‌, రష్యా సంక్షోభంపై చర్చించనున్నట్టు చెప్పారు.