మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (13:03 IST)

వీహెచ్‌పీ - భజరంగ్‌ దళ్‍ సంస్థలు మతపరమైన తీవ్రవాద సంస్థలు : సీఐఏ రిపోర్టు

భారత్‌కు చెందిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ సంస్థలు మతపరమైన తీవ్రవాద సంస్థలని అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఓ నివేదిక సమర్పించింది. వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ అనే పేరుత

భారత్‌కు చెందిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ సంస్థలు మతపరమైన తీవ్రవాద సంస్థలని అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఓ నివేదిక సమర్పించింది. వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ అనే పేరుతో సీఐఏ విడుదల చేసిన ఓ పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొంది.
 
దీంతో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ గ్రూపులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్‌లు.. రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకువస్తుంటాయని ఆ నివేదిక పేర్కొంది. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్‌లు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాయని, అవి రాజకీయ నాయకులను ప్రభావితానికి లోనుచేస్తుంటాయని, కానీ ఆ సంస్థలకు పనిచేసే వారు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయరు అని సీఐఏ తన నివేదికలో తెలిపింది. 
 
అయితే ఈ నివేదికను విశ్వహిందూ పరిషత్ నేతలు ఖండించారు. తమపై తీవ్రవాద ముద్ర వేసినందుకు సీఐఏ క్షమాపణలు చెప్పాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. అలాగే, సీఐఏ ఇచ్చిన నివేదికపై జోక్యం చేసుకుని మాట్లాడాలని భారత్ ప్రభుత్వాన్ని కోరినట్లు వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు.