విద్యార్థులతో అనుచితమైన టిక్‌టాక్ వీడియోలు.. అడ్డంగా బుక్కైన టీచర్
విద్యార్థులతో అనుచితమైన టిక్‌టాక్ డ్యాన్స్ వీడియోలను రూపొందించి టిక్‌టాక్ డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన బ్రెజిల్ టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ టీచర్ బ్రెజిల్‌లోని ఓ పాఠశాలలో ఇంగ్లీషు బోధించే సిబెల్లీ ఫెరీరాగా గుర్తించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ల మంది అనుచరులతో, సిబెల్లీ తరచుగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో హాట్ చిత్రాలు ఇంకా వీడియోలను పంచుకుంటుంది.
ఇలా తరగతి గదిలో ఇలా స్టూడెంట్స్‌తో వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ టీచర్‌పై ఆమెపై కఠినమైన చర్యలు తీసుకున్నారు.
సిబెల్లీ తన విద్యార్థులతో క్లాస్‌రూమ్‌లో డ్యాన్స్, టిక్‌టాక్ వీడియోలను క్లాస్‌ని మరింత ఆకర్షణీయంగా మార్చారు. అయితే, ఆమె ఇంగ్లీష్ క్లాస్‌లో డ్యాన్స్ వీడియోలు చేయడం త్వరలో రెగ్యులర్‌గా మారిందని నివేదిక పేర్కొంది. మరోవైపు, క్లాస్‌రూమ్‌కి ఆమె ఎంచుకున్న దుస్తులను కూడా సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా ఖండించారు. అడల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా ఆమె మారింది.
మగ విద్యార్థులతో ఆమె ఇలాంటి వీడియోలు చేయడంతో అడ్డంగా బుక్కైంది. ఇకపోతే.. సిబెల్లీ ఫెరీరా జీవశాస్త్రంలో డిగ్రీ హోల్డర్, బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ లావ్రాస్ నుండి పట్టభద్రురాలైంది.