గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (18:17 IST)

పాఠశాల విద్యార్థినిని వేధించిన కానిస్టేబుల్ సస్పెన్షన్

UP Cop
UP Cop
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పాఠశాల విద్యార్థినిని వెంటాడి వేధింపులకు గురిచేసిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. నిందితుడైన అధికారి షాహదత్ అలీ సైకిల్‌పై బాలికను అనుసరిస్తూ వేధింపులకు గురిచేశాడు.
 
లక్నోలోని సదర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, అలీ తన ఖాకీ యూనిఫాం ధరించి పాఠశాల విద్యార్థిని అనుసరిస్తూ ద్విచక్రవాహనం నడుపుతూ కనిపించాడు. 
 
మరో మహిళ కానిస్టేబుల్‌ను అనుసరించింది. బాలికను వేధిస్తున్న కానిస్టేబుల్‌ను ఫాలో చేస్తూ వీడియోను రికార్డ్ చేస్తుంది. ఆ మహిళను కానిస్టేబుల్ ఎందుకు వేధిస్తున్నావని అడిగి బెదిరించాడు. 
 
వీడియో రికార్డ్ చేసిన మహిళ కానిస్టేబుల్ ఆ ప్రాంతంలోని అమ్మాయిలను క్రమం తప్పకుండా వెంబడిస్తున్నాడని ఆరోపించింది. బాలిక తల్లిదండ్రులు అలీపై కేసు పెట్టడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అతడిని సస్పెండ్ చేశారు.