గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మే 2023 (13:35 IST)

Wrestler Protest: అబ్బా.. దేశానికి ఆడకపోవడమే మంచిది..

Vinesh Phogat
Vinesh Phogat
దేశ రాజధాని నగరం ఢిల్లీలో రెజ్లర్లు, మహిళా రెజ్లర్లు కొనసాగుతున్న నిరసన సందర్భంగా పోలీసులతో తోపులాట జరిగిన ఘటన కలకలం రేపింది. బ్రిజ్ భూషణ్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు- బీజేపీ ఎంపీ. అతను మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. ఈ కేసులో బుధవారం రాత్రి ఢిల్లీ పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగిన ఘటన సంచలనం రేపింది. ఈ సందర్భంలో, తమ డిమాండ్‌ను అంగీకరించడానికి ప్రభుత్వం నిరంతరం నిరాకరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 
 
భారతదేశానికి బంగారు పతకం సాధించిన వినేష్ ఫోగట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తున్న తీరు చూస్తుంటే, భారత దేశానికి ఏ అథ్లెట్ కూడా పతకం సాధించకపోవడం.. దేశం పట్ల ఆడకపోవడమే బెస్ట్ అనిపిస్తోందని తెలిపింది.