శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (10:13 IST)

ఢిల్లీలో బాలుడి హత్య.. తోటి విద్యార్థులే కొట్టి చంపేశారు.. ఎందుకంటే?

ఢిల్లీలో బదర్ పూర్ ప్రాంతంలో ఓ బాలుడు హత్యకు గురైయ్యాడు. 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని తోటి విద్యార్థులే హత్య చేశారు. గురువారం రాత్రి పోలీసులకు స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ విద్యార్థి మృతదేహం లభించింది. ఆ పక్కనే విద్యార్థి స్కూల్ బ్యాగ్ కూడా కనిపించింది. 
 
దీని ఆధారంగా పోలీసులు బాలుడి వివరాలు సేకరించారు. మృతుడి పేరు సౌరభ్ అని, అతడు మోలడ్‌బంద్ గ్రామ బిలాస్‌పూర్ క్యాంపులో నివసిస్తుంటాడని తేలింది. సౌరభ్ స్నేహితులు ఇద్దరు తమ స్కూల్ సమీపంలో సిగరెట్ తాగుతూ కనిపించారు. దీన్ని టీచర్‌కు చెప్పేస్తానని సౌరభ్ హెచ్చరించాడు. 
 
దీంతో ఆవేశానికి గురైన తోటి విద్యార్థులు సౌరభ్‌పై దాడి చేసి తలపై తీవ్రంగా కొట్టి చంపేశారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.