జియో సినిమాకు సరైన ప్రకటన.. స్టేడియంలో వుంటూనే స్మార్ట్ ఫోన్‌లో మ్యాచ్
కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌లో క్రికెట్ అభిమాని వీడియో ఒకటి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది.
కేవలం కొన్ని వందల గజాల దూరంలో ఉన్న మైదానంలో తన ఎదురుగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను చూడకుండా.. సదరు క్రికెట్ అభిమాని స్టేడియంలోని సీటుపై హాయిగా పడుకుని తన స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్ష మ్యాచ్‌ని చూశాడు. ఈ వీడియోను @GabbbarSingh అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
ఆన్‌లైన్‌లో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ అయిన జియో సినిమాకు ఇది సరైన ప్రకటనగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.