శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (14:58 IST)

అమెరికాలో భార్యాభర్తలు ఉద్యోగం చేయకూడదట.. ట్రంప్ నిర్ణయం?

అమెరికాలో విదేశాలకు చెందిన దంపతులు ఉద్యోగాలు చేయడంపై డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేశారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకే ఉద్యోగవకాశాలు ఇచ్చే రీతిలో కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హ

అమెరికాలో విదేశాలకు చెందిన దంపతులు ఉద్యోగాలు చేయడంపై డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేశారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకే ఉద్యోగవకాశాలు ఇచ్చే రీతిలో కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్-1 బి వీసా ద్వారా అమెరికాలో బాధ్యతలు నిర్వర్తించే దంపతులకు (హెచ్-4 వీసాదారులకు) అనుమతి రద్దయ్యే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. 
 
భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే హెచ్-1బి వీసా తప్పనిసరి. ఈ వీసా పొందే వారిలో 70శాతం మంది భారతీయులే వున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో హెచ్-1బి వీసా ద్వారా అమెరికాలో పనిచేసే భాగస్వాములకు హెచ్-4వీసాను కేటాయించారు. 
 
అయితే ట్రంప్ పుణ్యమాని అమెరికాలో పనిచేసే దంపతుల వీసా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ నిర్ణయం అమలైతే వేలాది మంది భారతీయులకు ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయమని తెలుస్తోంది.