శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (11:39 IST)

ఆకాశం నుంచి ఊడిపడిన దోపిడీ దొంగలు.. డబ్బుతో ఉడాయింపు..

robbery
అమెరికా దేశంలోని అట్లాంటాలో ఓ ఆసక్తికర దోపిడీ జరిగింది. ఇద్దరు దోపిడీ దొంగలు ఉన్నట్టు ఆకాశం నుంచి ఊడిపడ్డారు. వారిద్దరూ దుకారణంలోని మహిళను బెదిరించి, ఆమె వద్ద ఉన్న నగదును దోచుకుని ఉడాయించారు. అట్లాంటాలో సినీ పక్కీలో జరిగిన ఓ చోరీ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఓ దుకాణంలో చోరీకి వచ్చిన ఇద్దరు దుండగులు ముందుగా షాపు సీలింగ్‌లోకి చేరుకున్నారు. దుకాణంలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి నడుచుకుంటూ వస్తున్న సమయంలో సీలింగ్ బద్దలు కొట్టుకుని ఆ దుండగులు కిందకు దూకారు. ఈ హఠాత్పరిణామంతో ఆ మహిళా ఉద్యోగి భయాందోళనకు గురయింది. ఒక దుండగుడు ఆమెను బెదిరిస్తుండగా, మరో దుండగుడు కూడా సీలింగ్ నుండి కిందకు దూకాడు.
 
వీరు ఇద్దరు కలిసి ఆమెను ఓ గదిలోకి తీసుకువెళ్లి.. అక్కడ ఉన్న సేఫ్‌ లాకర్‌ను తెరిపించి.. అందులోని సొమ్మును తమ బ్యాగులోకి సర్దుకున్నారు. ఆ తర్వాత ఆమెను అక్కడే టేపులతో బంధించి దుండగులు తాపీగా డోర్ తీసుకుని బయటకు వెళ్లిపోయారు. 
 
అట్లాంటా చెక్ క్యాషియర్స్‌లో జరిగిన ఈ దోపిడీలో మొత్తం 1,50,500 డాలర్లు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. దుండగులు నల్ల జాతీయులుగా అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.