ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మార్చి 2024 (15:24 IST)

డబ్ల్యూపీఎల్- చెలరేగిన ఎల్లిస్ పెర్రీ.. భారీ సిక్సర్‌కు కారు అద్దం పగిలింది..

cricket
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో భాగంగా యూపీ వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ(37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58)హాఫ్ సెంచరీతో రాణించింది. ఈ మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు కారు అద్దం పగిలింది. 
 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. ఎల్లిస్ పెర్రీ కొట్టిన భారీ సిక్సర్.. నేరుగా టాటా పంచ్ కారు విండోను బలంగా తాకింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 
 
దీప్తి శర్మ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్లిస్ పెర్రీ ధాటికి 80 మీటర్ల దూరంలో పడిన బంతి కారు విండోను బద్దలు చేసింది.