శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (21:22 IST)

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో టెక్కీ మృతి

Heart attack
Heart attack
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువ టెక్కీ మృతి చెందాడు. విశాఖపట్నం జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్ భార్గవ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. 
 
శనివారం ఉదయం గచ్చిబౌలి నుంచి తన స్నేహితులు దిలీప్, బాలప్రదీప్ అజయ్, తేజకిరణ్, ఆదిత్యలతో కలిసి ఘట్టుపల్లిలోని క్రికెట్ స్టేడియానికి వచ్చాడు. అయితే మధ్యాహ్నం క్రికెట్ ఆడుతుండగా తలనొప్పి రావడంతో ఆట మధ్యలో పక్కనే కూర్చోవాల్సి వచ్చింది. 
 
ఆ తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.