ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 19 జులై 2017 (11:47 IST)

అంత పెద్ద విమానమూ ఢమాలున ఆగిపోయింది. లెక్క తప్పింది మరి.

చిన్నబిడ్డలను బస్సులో తీసుకెళితే కండక్టర్ హాఫ్ టికెట్ డబ్బులివ్వమని అడిగితే గయ్ మంటూ సీన్ క్రియేట్ చేస్తాం. సంవత్సరమైనా కాని పిల్లలకు టికెట్ అడుగుతారా అంటూ గొడవకేసుకుంటాం. కానీ విమానంలో కూడా అదే పరిస్థితి తలెత్తితే.. ఏమవుతుంది? టికెట్ లేకుండా విమానంల

చిన్నబిడ్డలను బస్సులో తీసుకెళితే కండక్టర్ హాఫ్ టికెట్ డబ్బులివ్వమని అడిగితే గయ్ మంటూ సీన్ క్రియేట్ చేస్తాం. సంవత్సరమైనా కాని పిల్లలకు టికెట్ అడుగుతారా అంటూ గొడవకేసుకుంటాం. కానీ విమానంలో కూడా అదే పరిస్థితి తలెత్తితే.. ఏమవుతుంది? టికెట్ లేకుండా విమానంలో నాలుగేళ్ల పాప  కనిపించడంతో అంత పెద్ద విమానాన్ని కూడా ఐదుగంటలపాటు ఆపేశారు. ఇది ఎక్కడో కాదు మన పొరుగు శత్రువు చైనాలో జరిగింది. 
 
విషయానికి వస్తే.. నాలుగేళ్ల పాప ఐదు గంటల విమాన ఆలస్యానికి కారణమైంది. అంతేకాదు విమానంలోని ప్రయాణికులందరినీ మరోసారి భద్రతా సిబ్బంది తనిఖీ చేయాల్సిన పరిస్థితి తలెత్తేలా చేసింది. ఈ ఘటన చైనా రాజధాని బీజింగ్‌లో చోటుచేసుకుంది. బీజింగ్‌ నుంచి షాంఘై వెళ్తున్న విమానంలో ఓ నాలుగేళ్ల పాప టికెట్‌ లేకుండా ప్రవేశించింది. 
 
వాస్తవానికి రెండేళ్లకే టికెట్‌ పొందాల్సి ఉన్నా తల్లిదండ్రులు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి విమానంలోకి ఎక్కించారు. లోపలి సిబ్బంది గుర్తించడంతో ప్రయాణికులందరినీ దించి మళ్లీ తనిఖీలు నిర్వహించారు. దీంతో విమానం ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరింది. ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 
 
అయితే దీనిపై వారికి ఎలాంటి జరిమానా విధించలేదని తెలిసింది. ఈ ఘటన వల్ల విమానం 90 నిమిషాలు మాత్రమే ఆలస్యమైందని, ప్రతికూల వాతావరణం కారణంగా మిగతా ఆలస్యమైందని మరో పత్రిక పేర్కొంది.