బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 3 నవంబరు 2016 (10:08 IST)

వైట్ హౌస్‌లో ఒబామా వారసురాలు.. నేనంటే ఇష్టపడే వాళ్లు ఆమెకే ఓటెయ్యాలి..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌పై డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ కొంతమేరకు అధిక్యంలో ఉన్నట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. అ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌పై డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ కొంతమేరకు అధిక్యంలో ఉన్నట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయని సంస్థ వెల్లడించింది. డెమొక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌ను మద్దతిచ్చేందుకు అధ్యక్షుడు ఒబామా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.
 
హిల్లరీ విజయం సాధించి వైట్ హౌస్‌లో తన వారసురాలిగా రావాలని భావిస్తున్నానని ఒబామా అన్నారు. ఆయన, తాజా సర్వే ఫలితాలతో కొంత నిరాశ చెందినప్పటికీ, ఆ వెంటనే హిల్లరీకి ఓటు వేయాలని వెల్లడించారు. ఎన్నికలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ, తన మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీకి మద్దతివ్వాలని కొలంబస్‌లో జరిగిన ప్రచార సభలో ఆయన అన్నారు. 
 
"ఆడవారైనా మగవారైనా ఆమెతో సమానమైన వారెవ్వరు లేరు. నేను, బిల్ క్లింటన్... మా కన్నా హిల్లరీకే అర్హతలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చక్కగా అధ్యక్షురాలిగా పనిచేయగలుగుతుంది" అని కితాబునిచ్చారు. తన కోసం ఏం చేశారో అదే ఇప్పుడు హిల్లరీ కోసం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తనంటే ఇష్టముంటే హిల్లరీకి ఓటేయాలని కోరారు. కాగా, ఈ ఐదు రోజుల పాటు ఒబామా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి హిల్లరీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.