శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (16:41 IST)

రెండేళ్ల క్రితం కొన్న లాటరీ టికెట్.. రూ.90లక్షలు తగిలింది..

powerball lottery
జర్మనీకి చెందిన యువతి ఒకరు రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్‌కు బహుమతి లభించింది. సదరు యువతి 2022 సంవత్సరం లాటరీ టిక్కెట్‌ను కొన్నది. ఆ తర్వాత ఆ టికెట్ సంగతి మరిచిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి ఇంటిని శుభ్రం చేస్తుండగా ఆ లాటరీ కంటపడింది. ఈ లాటరీకి ఏమైనా ప్రైజ్ పడిందా అని చెక్ చేసే సరికి ఆ యువతికి షాక్ తప్పలేదు. సదరు యువతి కొనుగోలు చేసిన లాటరీకి 91 లక్షల బహుమతి లభించిందని తెలిసి షాక్ అయ్యింది. 
 
జర్మనీలో లాటరీ టికెట్‌ పడిన రెండేళ్లైనా బహుమతి పొందవచ్చు. వెంటనే పరుగుపరుగునా ఆ లాటరీ టికెట్‌ను తీసుకెళ్లిన సదరు యువతి 91 లక్షల నగదు బహుమతిని పొందినట్లు సమాచారం వెలువడింది.