గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:10 IST)

శానిటైజర్లు వాడుతున్నారా? జాగ్రత్త.. లేకుంటే ఇలాంటి ప్రమాదం తప్పదు..?

కరోనా వైరస్ కారణంగా శానిటైజర్లు వాడటం తప్పనిసరిగా మారింది. అయితే శానిటైజర్లకు మండే గుణం వుండటంతో కాస్త జాగ్రత్తగా వుండాలని వైద్యులు అంటున్నారు. అందుచేత ఆ ద్రావణంతో కాసింత జాగ్రత్తగా మెలగాలి. లేకుంటే ప్రమాదమనేందుకు ఈ ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో కేట్‌వైడ్‌ నివసిస్తోంది. 
 
మొన్న ఆదివారం ఎప్పటిలాగే తన చేతులకు శానిటైజర్‌ రాసుకుంది. రాసుకున్నాక క్యాండిల్‌ వెలిగించడం కోసం అగ్గిపుల్ల గీసింది. అదే ఆమె చేసిన తప్పిదం.. చేతికి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా చేతికి మంటలు అంటుకోవడంతో భీతిల్లిన ఆమె వెనక్కి మళ్లింది. అలా ఆమె రెండో తప్పు చేసింది. 
 
ఎందుకంటే వెనకాలే శానిటైజర్‌ బాటిల్‌ ఉంది. అది కాస్త భగ్గున మండింది. మండటమే కాదు బాంబులా పేలింది. దాంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఆ మంటలకు ఆమె ముఖం, చేతులు, కాళ్లు కాలాయి. ఆ టైమ్‌లో ఇంట్లో కేట్‌వైడ్‌ కూతుళ్లు ఉన్నారు కాబట్టి సరిపోయింది. వారు వెంటనే స్థానికుల సాయంతో తల్లిని హాస్పిటల్‌లో చేర్చారు.. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. అందుకే శానిటైజర్లు వాడేటప్పుడు జాగ్రత్త వహించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.