శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (14:59 IST)

వరకట్నం కోసం అలా చంపేశాడు.. గర్భవతిగా వున్నా గంగలో కలిపేశాడు..

ఆధునికత పెరిగినా.. పురుషులకు సమానంగా స్త్రీలు అన్నీ రంగాల్లో రాణించినా.. వరకట్నం కోసం వేధించే.. అకృత్యాలకు పాల్పడే దుర్మార్గుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు.

తాజాగా కట్నం కోసం గర్భవతి అనికూడా చూడకుండా కడతేర్చాడు భర్త. ఆపై ఆనవాలు చిక్కకుండా మృతదేహాన్ని గంగానదిలో పడేశాడు. అనుమానం వచ్చిన మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ అమానుష ఘటన దేశరాజధాని ప్రాంతం శివార్లలో ఉన్న ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో ఉంటున్న నేహ (30)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజులు బాగానే ఉన్న ఆమె భర్త, తన తల్లిదండ్రులతో కలిసి అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు.

కష్టంగా కాలం గడుపుతూ వస్తున్న ఆమె ఈ మధ్యే గర్భం దాల్చింది. ఏమనుకున్నారో ఏమో.. అత్త, మామ, భర్త కలిసి ఆమెను చంపేశారు. అనంతరం గంగా నదిలో పడేశారు.
 
అత్తగారింట్లో కూతురు కన్పించకపోవడంతో అనుమానం వచ్చిన నేహ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లుడుతో పాటు, ఆయన తల్లి దండ్రులు కట్నం కోసం తన కూతురును హింసిస్తున్నారని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు నేహ భర్తను అరెస్టు చేశారు. 
 
విచారణ సందర్భంగా నేహను తామే చంపామని, మృతదేహాన్ని గంగా కాలువలో పడేశామని తెలిపాడు. దీంతో ఆయనతోపాటు, ఆయన తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై కేసు నమోదుచేశారు. నేహ మృతదేహం కోసం గాలిస్తున్నామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేందర్ గిరి వెల్లడించారు.