1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 11 మే 2019 (13:51 IST)

కివీస్ చిలుక పిల్లకు అరుదైన శస్త్రచికిత్స.. మెదడులో రంధ్రం...?

న్యూజిలాండ్‌లో పుట్టి 56 రోజులే అయిన చిలుక పిల్లకు.. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మెదడులో అరుదైన శస్త్రచికిత్సను చేశారు.. ఆ దేశ వెటనరీ వైద్యులు.


న్యూజిలాండ్‌లో మాత్రమే పెరిగే కాకాపో రకానికి చెందిన చిలుకలు ప్రస్తుతం 144 మాత్రమే వున్నాయి. న్యూజిలాండ్‌కు దక్షిణ ప్రాంతంలోని గాడ్‌ఫిష్ దీవిలో దొరికిన కాకాపో రకానికి చెందిన చిలుక పిల్లకు వైద్యులు అరుదైన చికిత్స చేశారు. 
 
ఆ చిలుక పిల్ల మెదడులో గాయం ఏర్పడటంతో వెటనరీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ చిలుక పిల్ల మెదడులో రంధ్రం వుండటాన్ని గమనించిన వైద్యులు.. శస్త్రచికిత్స చేశారు. ఈ చిలుకలు రాత్రిపూట మాత్రమే అటవీ ప్రాంతాల్లో సంచరిస్తాయని.. ప్రొఫెసర్ కార్టెల్ తెలిపారు. ఈ శస్త్రచికిత్స కోసం కివీస్ విమాన శాఖ చిలుక పిల్లను వైల్డ్ బేస్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎలాంటి రుసుమును తీసుకోలేదని కార్టెల్ వెల్లడించారు.