గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (09:22 IST)

మేమిద్దరం కవలలం.. ఒకేసారి కడుపు పండించే మగాడు ఉన్నాడా??

తామిద్దరం కవలల పిల్లలం. కానీ, తామిద్దరం ఒకేసారి గర్భందాల్చి... ఒకేసారి పండంటి బిడ్డలకు జన్మనివ్వాలని భావిస్తున్నాం. అందుకు సరైన మగాడు ఉన్నాడా? అంటూ ఆ ఇద్దరు సోదరులు ప్రశ్నిస్తున్నారు. ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ... ఆ ఇద్దరు కవలలు కోరుతున్న నిజమైన కోరిక. ఒకేసమయంలో ఒకరితోనే గర్భం దాల్చాలని వారు ప్రయత్నిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆస్ట్రేలియాకు చెందిన అన్నా, లూసీ డిసిన్క్యూ ప్రపంచంలోనే అత్యంత సమరూప కవలలుగా ప్రసిద్ధికెక్కారు. అయితే, చిన్నప్పటినుంచి తాము ఒకేవిధంగా కనిపించేలా అంటే ఎలాంటి తేడా ఉండకుండా చూసుకుంటున్నారు. ఇందుకోసం ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నారు. 
 
లిప్ ఫిల్లర్లు, బ్రెస్ట్‌ ఇంప్లాంట్లు, ముఖానికి పచ్చబొట్టు..ఇలా ఇద్దరిలోనూ కామన్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం వారు ఇప్పటివరకూ 14 రకాల ఆపరేషన్లను చేయించుకున్నారు. ఈ శస్త్రచికిత్స కోసం 2,50,000 డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు చేశారు. 
 
అయితే, 2018లో అన్నా, లూసీ డిసిన్క్యూకు ఒక వింతైన కోరిక కలిగింది. 2012 నుంచి బెన్ బైర్న్‌ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్న వీరు అతడినే వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే, బహుభార్యత్వం చట్టవిరుద్ధం కాబట్టి, వారి వివాహ ప్రణాళికలను పక్కన పెట్టాల్సి వచ్చింది. అప్పటినుంచి వార్తల్లో కనిపించని వీరు సోమవారం సడెన్‌గా మళ్లీ ఓ వింతైన కోరికతో చర్చనీయాంశమయ్యారు. 
 
ఓ టీవీ షో ఇంటర్వ్యూలో తమ గర్భధారణ గురించి మాట్లాడి, అందిరినీ అవాక్కయ్యేలా చేశారు. ఒకే సమయంలో ఒకే వ్యక్తితో తాము గర్భం దాల్చాలనుకుంటున్నట్లు వారు వెల్లడించారు. వీరి సంభాషణ సోషల్‌ మీడియాలో వైర్‌ల్‌ అయ్యింది. ఇదెలా సాధ్యం.. ఇదెక్కడి చోద్యం అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఐవీఎఫ్‌ పద్ధతిలో తాము పిల్లల్ని కనాలనుకుంటున్నామని చెప్పిన వీరు.. ప్రెగ్నెన్సీ మాత్రం ఇద్దరికీ ఒక్కరితోనే ఒకే సమయంలో రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 
 
ఇది విని అవాక్కయిన షో హోస్ట్‌ రూత్‌ లాంగ్స్‌ఫోర్డ్‌ .. ఒకే సమయంలో.. ఒకరితోనే గర్భం దాల్చేందుకు ఎలా ప్లాన్‌ చేస్తున్నారు అని ప్రశ్నించగా, అక్కాచెల్లెళ్లు ధీటైన జవాబు ఇచ్చారు. 'మేం కలిసి స్నానం చేస్తాం. కలిసి పడుకుంటాం. కలిసి తింటాం. మాకు ఒకేసారి ఆకలి అవుతుంది. ప్రతిదీ ఒకేలా ఉంది. ఇది మీకు రుగ్మతలా కనిపించవచ్చు. కానీ మేం జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నామో అలా జీవిస్తున్నాం. ఇద్దరం ఒకరిలానే ఉండాలనుకుంటున్నాం' అని చెప్పుకొచ్చింది. అంతేనా, 'మేం కలిసి గర్భం దాల్చాలనుకుంటున్నాం.. జీవితంలో ప్రతిదీ కలిసి చేయాలనుకుంటున్నాం. ఇద్దరం కలిసే వృద్ధులమవుతాం.. కలిసే చనిపోతాం' అని వారు చెప్పారు.