ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:39 IST)

హైదరాబాదీ బిర్యానీ వండిన సురేశ్‌ రైనా, అంబటి రాయుడు (Video)

Suresh Raina-Ambati Rayudu
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్‌లో భాగంగా క్రికెటర్లు మైదానంలో సత్తా చాటడంతో పాటు.. వంటింట్లోనూ అదరగొడుతున్నారు. తాజాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ను మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమితో ఆరంభించింది. తదుపరి మ్యాచ్‌లో గెలుపుతో విజయాలబాట పట్టాలని ధోనీసేన భావిస్తోంది. 
 
తొలి మ్యాచ్‌ అనంతరం విరామం లభించడంతో ఆటగాళ్లు తాము బస చేస్తున్న హోటల్‌లో సరదాగా గడిపారు. ఐతే మైదానంలో పరుగుల వరద పారించే స్టార్‌ బ్యాట్స్‌మెన్లు సురేశ్‌ రైనా, అంబటి రాయుడు జట్టు సభ్యుల కోసం కమ్మని పసందైన వంటకాలు సిద్ధం చేశారు.
 
హైదరాబాదీ బిర్యానీ వండటంలో స్పెషలిస్ట్‌ అయిన తెలుగు క్రికెటర్ రాయుడు హోటల్‌ కిచెన్‌లో దగ్గరుండి బిర్యానీ తయారు చేశాడు. రైనా కూడా రుచికరమైన బిర్యానీ తయారు చేయడంలో సహాయం చేశాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోను చెన్నై ఫ్రాంఛైజీ సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. తమిళ సినిమా ఎన్నా సమయాలో( ఏం వంటకం) అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.