కెమెరా యాంగిల్స్ అన్నీ ఆమెవైపే..? ఇంతకీ ఎవరా Mystery Girl..?
ఐపీఎల్ 2022 భాగంగా.. కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఒక యువతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
స్టాండ్స్ నుంచి మ్యాచ్‌ను చూస్తూ ఆ యువతి ఎంజాయ్ చేస్తుంటే.. ఆమె అందానికి ఫిదా అయ్యామా అన్నట్లుగా కెమెరా యాంగిల్స్ అన్ని ఆమెవైపే తిరిగాయి. ప్రస్తుతం సదరు యువతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంతకీ ఎవరా అమ్మాయి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి ఎవరు..? ఏ జట్టుకి సపోర్టు చేయడానికి వచ్చింది అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.
మొత్తానికి తన అందంతో ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కాగా ఇంతకముందు కూడా ఇదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్‌లో ఒక యువతి ఫోటోలు వైరల్‌గా మారాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ కేకేఆర్‌పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో ప్లేఆఫ్ చేరగా.. గతేడాది రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్ లీగ్ దశలోనే వైదొలిగింది.