సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మే 2022 (14:42 IST)

వైభవంగా ఆది-నిక్కీ గల్రాణీల వివాహం..

Adi_Nikki
Adi_Nikki
హీరో ఆదిపిని శెట్టి- హీరోయిన్ నిక్కీ గల్రాణీల వివాహం వైభవంగా జరిగింది. చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌ వేదికగా వీరి వివాహం పెద్ద వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఇంకా అలాగే స్నేహితులు మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు. 
 
ఈ నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా టాలీవుడ్ నుంచి హీరో నాని, సందీప్‌ కిషన్‌లు ఇంకా ఆర్య తదితరులు ఆది- నిక్కీల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జరిగిన హల్దీ వేడుకల్లో వీరు ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు.
 
ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు ఇంకా అలాగే వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు ఇంకా నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.  
 
2015లో విడుదలైన యాగవరైనమ్‌ నా కక్కా అనే తమిళ సినిమాలో మొదటి సారిగా జంటగా నటించారు ఆది ఇంకా నిక్కీ గల్రాణి. ఆపై మెల్లగా ప్రేమికులుగా మారారు. అయితే తమ ప్రేమను మాత్రం వీరు చాలా రోజులు రహస్యంగానే ఉంచారు.
 
ఇక ఈ సంవత్సరం మార్చి 24న ఇరు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. మే 19న వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే.. రంగస్థలం, నిన్నుకోరి, సరైనోడు ఇంకా అజ్ఞాతవాసి లాంటి సినిమాల్లో నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు ఆది. 
 
ఇప్పుడు రామ్‌ పోతినేని హీరోగా నటిస్తోన్న వారియర్‌ సినిమాలో కూడా విలన్‌గా కనిపించనున్నాడు. మరోవైపు నిక్కీ గల్రానీ కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం నిక్కీ చేతిలో ఓ తమిళ, ఓ మలయాళీ సినిమాలు ఉన్నాయి.