రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్‌ మరో మూడు నెలలు పొడగింపునకు కారణాలివే...

రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్‌ను మరో మూడు నెలలు పాటు పొడంగించడానికి కారణాలు లేకపోలేదు. నిజానికి దేశ టెలికాం రంగంలోకి జియో సేవలు అందుబాటులోకి వచ్చాక... ఇతర టెలికాం కంపెనీలన్నీ కుదేలయ్యాయి. పైగా, తమ కష్టమర్లు

reliance jio
pnr| Last Updated: ఆదివారం, 30 అక్టోబరు 2016 (16:59 IST)
రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్‌ను మరో మూడు నెలలు పాటు పొడంగించడానికి కారణాలు లేకపోలేదు. నిజానికి దేశ టెలికాం రంగంలోకి జియో సేవలు అందుబాటులోకి వచ్చాక... ఇతర టెలికాం కంపెనీలన్నీ కుదేలయ్యాయి. పైగా, తమ కష్టమర్లు ఎక్కడ చేజారిపోతారోనన్న భయంతో... రోజుకో సరికొత్త ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి.

అయితే ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ఈ వెల్‌కమ్ ఆఫర్‌ను మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు జియో ప్రకటించింది. అయితే అసలు జియో ఈ ఆఫర్‌ను పొడిగించడానికి కారణమేంటి? అన్ని నెలలు ఉచితంగా ఫ్రీ డేటా, ఫ్రీ కాలింగ్ సదుపాయాన్ని వినియోగదారులకు ఎలా అందించగలుగుతోంది? ప్రస్తుతం టెలికామ్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్.

జియో సేవల పట్ల మొబైల్ యూజర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో దిద్దుబాటు చర్యలకు జియో యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఇతర టెలికామ్ కంపెనీలు కాల్ డ్రాప్స్‌తో అవరోధం కలిగించాయని, కాల్స్ పట్ల తీవ్ర నిరాశకు గురైనట్లు జియోకు అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఫ్రీ కాలింగ్ సేవలను మెరుగుపరచడానికి చర్యలు చేపట్టింది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్లే ఆఫర్‌ను పొడిగించిందన్నది మార్కెట్ విశ్లేషకుల అంచనాగా ఉంది.

ఇకపోతే జియో ఆఫర్స్‌ను ప్రకటించిన రోజే కంపెనీ యజమాని ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. తమ లక్ష్యం 100 మిలియన్ల యూజర్లని స్పష్టం చేశారు. ప్రస్తుతం జియో 25 మిలియన్ల మార్క్‌ను దాటింది. అంటే లక్ష్యాన్ని చేరుకునేందుకు కనీసం రెండు, మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే మరో మూడు నెలలు ఉచిత ఆఫర్‌ను పొడగించినట్టు తెలుస్తోంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్‌ వల్ల ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేయడంతో జియోకు అడ్డంకులు తొలగాయి. ఇతర కంపెనీలు జియోపై ఫిర్యాదు చేసినప్పటికీ ట్రాయ్ పెద్దగా పట్టించుకోలేదు. పైగా రిలయన్స్ జియో వినియోగదారులు చాలా తక్కువ మందే ఉన్నారని ట్రాయ్ ప్రకటించడం మరో కొసమెరుపు. ఈ ప్రకటనతో ఆఫర్‌ను పొడిగించినా తమకెలాంటి ఇబ్బంది లేదని నియంత్రణ మండలి చెప్పకనే చెప్పేసింది.దీనిపై మరింత చదవండి :