సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (12:29 IST)

భారత్‌లో ఊరిస్తున్న 5జీ నెట్‌వర్క్ సేవలు.. అందుబాటులోకి ఎప్పుడు?

భారత్‌లో 5జీ నెట్‌వర్క్ సేవలు ఊరిస్తూనే వున్నాయి. ఓ వైపు మార్కెట్‌లో 5జీ మొబైల్ ఫోన్లు కంపెనీలు విడుదల చేసేస్తున్నా..నెట్‌వర్క్ మాత్రం అందుబాటులో రావడం లేదు. మార్కెట్‌లో హ్యాండ్‌సెట్ల హడావిడి తప్ప నెట్‌వర్క్ సందడి కన్పించడం లేదు. 
 
వాస్తవానికి 2021 మే నెలలోనే కేంద్ర ప్రభుత్వం 5జీ ట్రయల్స్ కోసం వివిధ టెలికం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించింది. ట్రయల్స్ నిర్వహించేందుకు జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా , ఎంఎన్‌టిఎల్‌లు అనుమతి పొందాయి. 
 
నిర్దేశిత లక్ష్యం ప్రకారం నవంబర్ నెలలోగా ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిర్దేశిత సమయంలోగా ట్రయల్స్ పూర్తి కాలేదని.. మరో ఆరు నెలల గడువు ఇవ్వాల్సిందిగా టెల్కో కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. 
 
టెల్కో కంపెనీలు కోరిన విధంగా మరోసారి ట్రయల్స్ గడువు పెంచిచే ఇక 5జీ నెట్‌వర్క్ సేవలు వాణిజ్యపరంగా అందుబాటులో వచ్చేందుకు మరింత సమయం పట్టవచ్చు. అంటే 2022 ఏప్రిల్-జూన్ వరకూ నిరీక్షించాల్సి వస్తుంది.