మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2017 (14:10 IST)

టెలినార్-ఎయిర్ టెల్ విలీనం.. జియోను దెబ్బతీసేందుకేనా?

టెలినార్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్ చేసిన ప్రతిపాదనకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జియో దెబ్బకు టెలికాం రంగంలో తన కంపెనీని నష్టాలను గట్టెక్కింటేందుకు ఎయిర్‌టెల్ మల్లగుల్ల

టెలినార్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్ చేసిన ప్రతిపాదనకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జియో దెబ్బకు టెలికాం రంగంలో తన కంపెనీని నష్టాలను గట్టెక్కింటేందుకు ఎయిర్‌టెల్ మల్లగుల్లాలుపడుతోంది. ఎక్కువ జనసాంద్రత కలిగిన ఈ సర్కిళ్లలో టెలినార్‌ వ్యాపారాన్ని చేజిక్కించుకోవడం వల్ల కంపెనీ అభివృద్ధికి అవకాశాలున్నట్లు ఎయిర్ టెల్ భావిస్తోంది.
 
ఈ నేపథ్యంలో టెలినార్ ఇండియా సంస్థ దేశ వ్యాప్తంగా స్పెక్ట్రమ్‌ కలిగి వుండటంతో.. ఏడు టెలికాం సర్కిళ్లలో వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. ఇందుకు కావాల్సిన అనుమతులు కూడా లభించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. 
 
ఈ మేరకు కుదిరిన ఒప్పందం ప్రకారం భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ టెలినార్‌ ఇండియాకు ఉన్న స్పెక్ట్రమ్‌, లైసెన్స్‌లు, ఆ సంస్థ కార్యకాలాపాలతో సహా ఉద్యోగులను ఎయిర్‌టెల్‌లో విలీనం చేసుకోనుంది. ఇంకా టెలినార్- ఎయిర్‌టెల్ విలీనం ద్వారా ఎయిర్‌టెల్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, అస్సాంలలోని టెలినార్‌ వ్యాపారాన్ని సొంతం చేసుకోనుంది.