శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జులై 2020 (19:01 IST)

నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. అమేజాన్ నుంచి వెయ్యి ఉద్యోగాలు

రిటైల్‌ దిగ్గజం అమేజాన్ నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐర్లాండ్‌లోని అమెజాన్‌ కార్యాలయంలో 1,000 మంది ఖాళీలకు త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. అయితే క్లౌడ్ సేవలకు(డిజిటల్‌) డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ పేర్కొంది. కరోనా దెబ్బతో అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న వేళ.. నిరుద్యోగులను అమేజాన్ ఆదుకుంటోంది. 
 
ఇందులో భాగంగా ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌లో నూతన అమెజాన్‌ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ కార్యాలయానికి గానూ కొత్తగా నియమించుకునే వారు బిగ్‌డేటా స్పెషలిస్టులు, ప్రోగ్రామ్‌ మేనేజర్లు తదితర విభాగాలలో సేవలంధించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 
 
మరోవైపు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ విభాగాలలో కూడా ఉద్యోగులను నియమించుకోనున్నారు. కస్టమర్లకు మైరుగైన సేవలను అందించేందుకు అమెజాన్‌ సాంకేతికతను అద్భుతంగా ఉపయోగించుకుంటుందని ఐర్‌ల్యాండ్‌కు చెందిన అమెజాన్‌ మేనేజర్‌ మైక్‌ బియరీ పేర్కొన్నారు.